- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బైకును ఢీకొట్టిన కాలేజీ బస్సు.. ముగ్గురు దుర్మరణం
ఏలూరు జిల్లా పెదవేగి మండలం జానంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును కాలేజీ బస్సు ఢీకొట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: ఏలూరు జిల్లా(Eluru District) పెదవేగి మండలం జానంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. బైకును కాలేజీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న ముగ్గురూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బస్సులో ఉన్న పలువురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చారు. మృతులు ఏలూరు బీడీ కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. కూలీ పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు నిర్దారించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నెలల వ్యవధిలోనే జిల్లాలో రోడ్డుప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగింది. వేగం కంటే ప్రాణాలు ముఖ్యమని పోలీసులు సూచనలు చేస్తున్నారు. రోడ్లమీద ప్రయాణాలు చేసే సమయంలో ఇంట్లో కుటుంబసభ్యులను గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు.






