మద్యం మత్తులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు దుర్మరణం

by Kema Shiva Kumar |

మద్యం మత్తులో బైక్ నడుపుతూ గోడను ఢీకొట్టగా ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లాలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

మద్యం మత్తులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: మద్యం మత్తులో బైక్ నడుపుతూ గోడను ఢీకొట్టగా ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లాలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెనుమంట్ర (Penumantra) పరిధిలోని పోలమూరు (Polamoor) గ్రామంలో మద్యం మత్తులో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులు నియంత్రణ కోల్పోయి ఎదురుగా ఉన్న గోడను బలంగా ఢీకొట్టారు.

ఈ దుర్ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలమూరు గ్రామస్థుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఇలాంటి దుర్ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు అన్నారు. అయితే, ఒకేసారి ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోవడంతో పోలమూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story