- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిర్మాణంలో ఉన్న ఇంటి పైకప్పు కూలి ముగ్గురు కార్మికులు మృతి
నిర్మాణంలో ఉన్న భవనం పై కప్పు కూలిపోయి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: నిర్మాణంలో ఉన్న భవనం పై కప్పు కూలిపోయి ముగ్గురు కార్మికులు మృతి (Three workers killed) చెందారు. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాద మృతుల్లో ఇద్దరు సోదరులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే మరో నలుగురు గాయపడ్డారు. ఘటన సదరు జిల్లా లంబుహా పోలీస్ స్టేషన్ పరిధిలోని ధారియామావు గ్రామంలో జరిగింది. జిల్లా మేజిస్ట్రేట్ కుమార్ హర్ష్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కున్వర్ అనుపమ్ సింగ్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించిన. గాయపడ్డ వారిలో ఇద్దరిని లంబుహా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కి తరలించారు. అలాగే తీవ్ర గాయలైన వారిని ప్రభుత్వం నిర్వహిస్తున్న మెడికల్ కాలేజ్‌కి రిఫర్ చేశారు. పోలీసులు, అధికారులు ప్రమాద కారణాలపై దర్యాప్తు చేపట్టి, భవన నిర్మాణంలో భద్రత ప్రమాణాలు పాటించబడిందో లేదో తేల్చుకోవడానికి చర్యలు తీసుకుంటున్నారు.






