- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో విషాదం.. ఒకే రోజు ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలో ఒకే రోజు నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. చదువుకుంటూ ఆనందంగా జీవితాన్ని గడపాల్సిన వయసులో బలవన్మరణానికి పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ విషాద ఘటనలు వేరు వేరు కాలేజీల్లో చోటు చేసుకున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఒకే రోజు నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. చదువుకుంటూ ఆనందంగా జీవితాన్ని గడపాల్సిన వయసులో బలవన్మరణానికి పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ విషాద ఘటనలు వేరు వేరు కాలేజీల్లో చోటు చేసుకున్నాయి. బాచుపల్లి శ్రీచైతన్య జూ. కాలేజీలో వర్ష 16 అనే ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వర్ష హాస్టల్ గదిలోనే చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
మరోవైపు నిజాంపేటలో మంజునాథ్ అనే 18ఏళ్ల ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మంజునాథ్ ప్రగతినగర్ లోని ప్రగతి జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ప్రేమ వ్యవహారంలో అమ్మాయి తల్లి, మరో మహిళ ఇంటికి వచ్చి వార్నింగ్ ఇవ్వడంతో మంజునాథ్ ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీలోనూ ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హుజురాబాద్ కు చెందిన విజ్ఞాన్ అనే విద్యార్థి ఓయూలో మైనింగ్ విభాగంలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కాగా క్యాంపస్ లోని ఓ చెట్టుకు విజ్ఞాన్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూడు డెడ్ బాడీలను కూడా పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రలు శోకసంద్రంలో మునిగిపోయారు.






