శ్మశానంలో అర్ధరాత్రి క్షుద్ర పూజలు.. కాలుతున్న చితిలో నుంచి తల తీసి, చుట్టూ నిమ్మకాయలు పేర్చి..

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ మీరట్‌లో భయానక ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు వ్యక్తులు అజద్రా గ్రామంలో శ్మశానంలో అర్థరాత్రి క్షుద్రపూజలు చేశారు. గాజేంద్ర అనే దళిత యువకుడి చితిలో నుంచి తలను తీసి.. దాని చుట్టూ నిమ్మకాయలు, అరటిపండు, అగర్బత్తులు,

శ్మశానంలో అర్ధరాత్రి క్షుద్ర పూజలు.. కాలుతున్న చితిలో నుంచి తల తీసి, చుట్టూ నిమ్మకాయలు పేర్చి..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ మీరట్‌లో భయానక ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు వ్యక్తులు అజద్రా గ్రామంలో శ్మశానంలో అర్థరాత్రి క్షుద్రపూజలు చేశారు. గాజేంద్ర అనే దళిత యువకుడి చితిలో నుంచి తలను తీసి.. దాని చుట్టూ నిమ్మకాయలు, అరటిపండు, అగర్బత్తులు, లిక్కర్ బాటిల్ పెట్టి తాంత్రిక పూజలు చేశారు. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు.. వారిని పట్టుకుని చితకబాదారు. పోలీసులకు సమాచారం అందించారు.

బల్జీత్, ఇమ్రాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా మూడో వ్యక్తి షౌకీన్ పారిపోయాడు. ఘటనాస్థలంలో వస్తువులను స్వాధీనం చేసుకున్నామని.. మత విశ్వాసాలను గాయపరచడం, మతం-జాతి వైరం పెంచడం వంటి తప్పుల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు అదనపు ఎస్పీ అభిజీత్ కుమార్. మూడో వ్యక్తి కోసం గాలిస్తున్నామని.. త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.

Next Story