- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు స్పాట్ డెడ్
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును డీసీఎం వ్యాన్ వెనుక నుంచి ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును డీసీఎం వ్యాన్ వెనుక నుంచి ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. శంషాబాద్ మండలం పెద్దషాపూర్‌లో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గోపాల్(47) అనే వ్యక్తి ) తన భార్య అంజలి (42), కుమార్తె స్వాతి (9)తో కలిసి బైక్‌పై వెళ్తుండగా శంషాబాద్‌లోని షాపూర్ గ్రామ సమీపంలో బైక్‌ను వెనుక నుంచి ట్రక్కు బలంగా ఢీకొట్టింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందన్న స్థానికుల సమాచారంతో డ్రైవర్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.






