- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బావిలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు మృతి
by Naga Rani Yarlagadda |
ఆదివారం తెల్లవారుజామున అన్నమయ్య జిల్లా (Annamayya District)లో విషాద ఘటన చోటుచేసుకుంది. పీలేరు మండలం బాలమువారిపల్లి వద్ద కారు అదుపుతప్పి బావిలోకి (Car Accident) దూసుకెళ్లింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆదివారం తెల్లవారుజామున అన్నమయ్య జిల్లా (Annamayya District)లో విషాద ఘటన చోటుచేసుకుంది. పీలేరు మండలం బాలమువారిపల్లి వద్ద కారు అదుపుతప్పి బావిలోకి (Car Accident) దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు స్థానికుల సహాయంతో ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. జేసీబీ సహాయంతో కారును బావిలో నుంచి తీయించి, మృతదేహాలను పోస్టుమార్టమ్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






