- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూడు కిలోల గంజాయి పట్టివేత
గంజాయి అమ్ముకొని సొమ్ము చేసుకునేందుకు వచ్చిన ముగ్గురు వ్యక్తుల నుండి మూడు కిలోల గంజాయిని బుధవారం రాత్రి పట్టుకున్నట్లు ఎస్సై మనోహర్ తెలిపారు.

దిశ, ఉట్నూర్ : గంజాయి అమ్ముకొని సొమ్ము చేసుకునేందుకు వచ్చిన ముగ్గురు వ్యక్తుల నుండి మూడు కిలోల గంజాయిని బుధవారం రాత్రి పట్టుకున్నట్లు ఎస్సై మనోహర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఒడిస్సాకి చెందిన ఉజ్జల్, పార్ధా, స్వరూప్ అదిలాబాద్ లో దినసరి కూలీలుగా పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అక్రమార్జనలో డబ్బులు సంపాదించాలని ఆశతో మూడు కిలోల గంజాయిని ఉట్నూర్ లో అమ్మేందుకు ఆదిలాబాద్ నుండి ఉట్నూర్ కి బస్ లో వచ్చారు.
పోలీసులకు అందిన సమాచారం మేరకు ఉట్నూర్ ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద తనిఖీ లు చేస్తున్నారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని పట్టుకొని తనిఖీలు చేయగా వారి వద్ద నుండి మూడు కిలోల గంజాయి పట్టుకుని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై మనోహర్ తెలిపారు. పట్టుకున్న నిందితులను రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు. జల్సాలకు, అక్రమంగా డబ్బులు సంపాదించేందుకు చెడు మార్గాలను ఎంపిక చేసుకొని జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన పేర్కొన్నారు.






