రైలుకింద పడి ముగ్గురు దుర్మరణం

by GSrikanth |   (  Updated:2023-01-22 05:58:15  IST  )

నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆత్మకూరు బ్రిడ్జి దగ్గర రైలుకింద పడి ముగ్గురు మృతిచెందారు.

రైలుకింద పడి ముగ్గురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆత్మకూరు బ్రిడ్జి దగ్గర రైలుకింద పడి ముగ్గురు మృతిచెందారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు గుర్తించారు. ప్రమాద వశాత్తు పడిపోయారా..? ఆత్మహత్య చేసుకున్నారా? అనే కోణంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి : చెట్టును ఢీకొట్టిన బస్సు.. 23 మందికి గాయాలు

Next Story