హత్యకు ఉపయోగించిన కారు ఇదే..!

by Taduka Kalyani |

రంగారెడ్డి జిల్లా షాబాద్ ఆరు మర్డర్ కేసు నిందితుడు రాజ్ కుమార్ ఓ ప్రైవేట్ కారును అద్దెకు తీసుకున్నాడు.

హత్యకు ఉపయోగించిన కారు ఇదే..!
X

దిశ, చేవెళ్ల : రంగారెడ్డి జిల్లా షాబాద్ ఆరు మర్డర్ కేసు నిందితుడు రాజ్ కుమార్ ఓ ప్రైవేట్ కారును అద్దెకు తీసుకున్నాడు. షాద్నగర్ కు చెందిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ వారి నుండి శుక్రవారం తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. (టీ జీ 07 బీ 5826)లో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి ఇదే కార్ లో తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆరు హత్యల అనంతరం షాబాద్ నుండి నందిగామ, తిమ్మాపూర్ వరకు వెళ్లి అక్కడ కారును పార్క్ చేశాడు. తిమ్మాపూర్ రైల్వే ట్రాక్ పక్కన నిలిపాడు. అతను సెల్ ఫోన్ సిగ్నల్ సైతం తిమ్మాపూర్ వరకే చూపించాయని తెలిసింది. పోలీసులు మాత్రం శ్రీశైలం వైపు వెళ్లినట్టు అనుమానిస్తున్నారు. ఈ కారుపై నల్గొండ జిల్లా పాన్గల్ లో జూన్ ఒకటో తేదీన డేంజరస్ డ్రైవింగ్ తో పోలీసులు చలాన్ ను విధించారు.

Next Story