Phone Tapping Case: పది నెలల జైలు జీవితం.. కాసేపటి క్రితమే విడుదల

by Gantepaka Srikanth |

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు(Phone Tapping Case)లో అరెస్టై చంచల్‌గూడ జైలు(Chanchalguda Jail)లో ఉన్న అదనపు ఎస్పీ తిరుపతన్నకు సుప్రీంకోర్టు (Supreme Court) బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Phone Tapping Case: పది నెలల జైలు జీవితం.. కాసేపటి క్రితమే విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు(Phone Tapping Case)లో అరెస్టై చంచల్‌గూడ జైలు(Chanchalguda Jail)లో ఉన్న అదనపు ఎస్పీ తిరుపతన్నకు సుప్రీంకోర్టు (Supreme Court) బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. 10 నెలలుగా పిటిషనర్‌ జైలులో ఉన్నారని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీట్‌ దాఖలు చేశారన్నారు. ఇంకా జైలులో ఉండాల్సిన అవసరం కనిపించడం లేదని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో మంగళవారం చంచల్‌గూడ జైలు అధికారులు విడుదల చేశారు. బెయిల్ మంజూరు సందర్భంగా తిరుపతన్న(Thirupathanna)కు సుప్రీంకోర్టు(Supreme Court) పలు సూచనలు చేసింది. ట్రయల్‌కు పూర్తిగా సహకరించాలి, జాప్యం చేయడానికి ప్రయత్నించవద్దని సూచించింది. సాక్షులను ప్రభావితం చేసినా, కేసులో ఆధారాలు చెరిపేయడానికి ప్రయత్నించినా రాష్ట్ర ప్రభుత్వం బెయిల్‌ రద్దుకు కోర్టును ఆశ్రయించవచ్చు. పాస్‌పోర్టు రద్దు సహా ఇతర బెయిల్‌ షరతులు అన్నింటినీ ట్రయల్‌ కోర్టు ఇస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది.

అంతకుముందు ప్రభుత్వం తరపు న్యాయవాది లూథ్రా కోర్టులో కీలక వాదనలు వినిపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌లో తిరుపతన్నే ప్రధాన నిందితుడని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో ఆయన పాత్రపై దర్యాప్తునకు మరో నాలుగు నెలల సమయం పడుతుందని తెలిపారు. కొంతమంది కీలక సాక్షులను ఇంకా విచారించాల్సి ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో తిరుపతన్నకు బెయిల్ ఇవ్వొద్దన్నారు. రాజకీయ నేతల ఆదేశాలతో హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ఆయన ట్యాపింగ్‌ చేశారని ఆరోపించారు. ఆధారాలు చెరిపేయడంలో కూడా కీలకంగా ఉన్నారన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఆధారాలన్నీ ధ్వంసం చేశారని వివరించారు.

ఇదిలా ఉండగా.. ఫోన్ ట్యాపింగ్ కేసు మరో కీలక మలుపు తిరగనుంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావులను అమెరికా ప్రభుత్వం డిపోర్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో వలసదారులు, క్రిమినల్ కేసులో నిందితులను ఆయా దేశాలకు అప్పగించాలని ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు రిమైండర్స్ లెటర్లను హైదరాబాద్ పోలీసులు పంపనున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులకు కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే.

Next Story