రంగారెడ్డి జిల్లాలో దొంగల బీభత్సం.. 10 లక్షల నగదు, 14 తులాల బంగారం చోరీ

by Kema Shiva Kumar |

రంగారెడ్డి జిల్లాలో దొంగల బీభత్సం.. 10 లక్షల నగదు, 14 తులాల బంగారం చోరీ
X

దిశ, వెబ్‌డెస్క్: దోపిడీ దొంగలు చోరీకి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ (Moinabad) మండల పరిధిలోని అమ్దాపూర్ (Amdapur) గ్రామంలో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఈనెల 23న వ్యక్తిగత పనిమీద గోవాకు వెళ్లారు. ఆయన భార్య కూడా ఈనెల 25న పిల్లలను తీసుకుని బంధువుల ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించిన దొంగలు, పక్కా పథకం ప్రకారం అర్ధరాత్రి సమయంలో ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలను తెరిచి అందులో ఉన్న సుమారు 14 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు. రూ.10 లక్షల లిక్విడ్ క్యాష్‌తో ఊడాయించారు.

కేసు నమోదు చేసిన పోలీసులు..

శ్రీనివాస్ కుటుంబ సభ్యులు తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటం, బీరువాలోని సామాన్లు చెల్లాచెదురుగా పడి ఉండటంతో షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మొయినాబాద్ పోలీసులు క్లూస్ టీం (Clues Team)తో స్పాట్‌కు చేరుకుని వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story