నగరంలో రెచ్చిపోయిన దొంగలు.. వృద్ధురాలి కళ్లలో కారం కొట్టి బంగారం అపహరణ

by Kema Shiva Kumar |

నగరంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు.

నగరంలో రెచ్చిపోయిన దొంగలు.. వృద్ధురాలి కళ్లలో కారం కొట్టి బంగారం అపహరణ
X

దిశ, వెబ్‌డెస్క్: నగరంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ఇప్పటికే చైన్స్ స్నాచింగ్‌ (Chain Snatching)‌లతో మహిళలు బయటకు వెళ్లాలంటేనే సమతమవుతోన్న వేళ కేటుగాళ్లు కొత్త మార్గాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. ప్రతిఘటనకు తావు లేకుండా కేవలం ఒంటరి వృద్ధ మహిళలను టార్గెట్‌గా చేసుకుని అందినకాడికి దోచుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇవాళ ఉదయం వనస్థలిపురం (Vanasthalipuram) పరిధిలోని సహారా ఎస్టేట్స్‌ (Sahara Estates)లో ఓ దొంగ ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళపై కన్నేశాడు. అనంతరం ఆమెతో మాటామాట కలుపుతూనే ఒక్కసారిగా కళ్లల్లోకి కారం కొట్టాడు. అనంతరం అదును చూసి ఆమె మెడలోంచి ఏకంగా 6 తులాల బంగారు ఆభరణాలను లాక్కేల్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాల సాయంతో దొంగను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Next Story