తిరుపతిలో దొంగల కలకలం.. ఉమెన్స్ హాస్టల్‌లోకి దూరి

by Ajay Maddhiboyina |

తిరుపతిలో దొంగల కలకలం రేగింది. తిరుపతిలోని భవానీ సర్కిల్ లో ఉన్న ఫ్రెండ్స్ హాస్టల్, ఉమెన్స్ హాస్టళ్లలో దొంగలు ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు.

తిరుపతిలో దొంగల కలకలం.. ఉమెన్స్ హాస్టల్‌లోకి దూరి
X

దిశ‌, వెబ్ డెస్క్: తిరుపతిలో దొంగల కలకలం రేగింది. తిరుపతిలోని భవానీ సర్కిల్ లో ఉన్న ఫ్రెండ్స్ హాస్టల్, ఉమెన్స్ హాస్టళ్లలో దొంగలు ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. ఎస్వీ పాలిటెక్నిక్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన సెల్ ఫోన్లను దొందతనం చేశారు. బాధితులు సెల్ ఫోన్లు మాయం అయ్యాయని పోలీసులను ఆశ్రయించడంతో సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియోలు చూసి షాక్ ఇయ్యారు.

సెల్ ఫోన్లు దొంగలించేందుకు ఓ దొంగ ఏకంగా లేడీ హాస్టల్‌లోకి ప్రవేశించాడు. ఒక్కో గదిలోకి వెళుతూ సెల్ ఫోన్లను దొంగలించి మరో గదిలోకి వెళుతున్నాడు. ముసుగు కప్పుకుని వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్నట్టు వీడియోలో కనిపిస్తుంది. అంతేకాకుండా ఎలాంటి భయంలేకుండా దర్జాగా వెళుతున్నట్టు కనిపిస్తుంది. అయితే లేడీస్ హాస్టల్ లోకి దొంగ దూరడంతో విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. తమకు సరైన రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నింధితుడి కోసం గాలిస్తున్నారు. VIDEO

Next Story