- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాలిసెట్ పరీక్ష కోసం వెళ్లి పెళ్లిపీటలు ఎక్కారు..!
ఉన్నతమైన లక్ష్య సాధన కోసం పాలీసెట్ పరీక్ష రాసేందుకని ఇంటి నుంచి వెళ్లిన (16) ఏళ్ల బాలిక పరీక్ష రాసిన అనంతరం ప్రియుడు మాయమాటలు నమ్మి ఏకంగా పెళ్లి పీటలు ఎక్కింది.

X
దిశ, ప్రతినిధి నాగర్ కర్నూల్: ఉన్నతమైన లక్ష్య సాధన కోసం పాలీసెట్ పరీక్ష రాసేందుకని ఇంటి నుంచి వెళ్లిన (16) ఏళ్ల బాలిక పరీక్ష రాసిన అనంతరం ప్రియుడు మాయమాటలు నమ్మి ఏకంగా పెళ్లి పీటలు ఎక్కింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాలిక పదవ తరగతి అనంతరం ఈ నెల 17న పాలీసెట్ ఎంట్రన్స్ పరీక్ష పేరుతో ఇంటి నుంచి జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రానికి వచ్చి పరీక్ష అనంతరం ప్రియుడి మాయమాటలు నమ్మి ఏకంగా పెళ్లి పీటలెక్కింది.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా ఆ జంటను పట్టుకొని బాలికకు కౌన్సిలింగ్ నిర్వహించి ఇంటికి పంపారు. బాలికకు మాయమాటలు చెప్పి నిబంధనలకు విరుద్ధంగా బాల్య వివాహం చేసుకున్న యువకుడిపై గురువారం కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరుపరిచినట్లు తెలిసింది.
Next Story






