- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుట్టినరోజు పిలిచారు.. పాడే కట్టి పంపించారు..
ఓ వివాహిత తన సవతి(భర్త చిన్న భార్య) కొడుకు బర్త్డే కి వచ్చి అనుమానాస్పద స్థితిలో మంగళవారం మృతి చెందింది.

దిశ,కొల్లాపూర్ : ఓ వివాహిత తన సవతి(భర్త చిన్న భార్య) కొడుకు బర్త్ డే కి వచ్చి అనుమానాస్పద స్థితిలో మంగళవారం మృతి చెందింది. మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమె సోదరులు బుధవారం కొల్లాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన గ్రామంలో కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించి గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూర్ గ్రామంలో తలారి రాముడు అదే గ్రామంలో దేవమ్మ(సౌమ్య)ను వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకు అదే గ్రామంలోనే తన సమీప బంధువు యువతితో తలారి రాముడు ప్రేమాయణం జరిపాడు. దీంతో ఆ యువతి గర్భవతి కావడంతో తమ కూతురిని ఎవ్వరూ పెళ్లి చేసుకోరని భావించి ఆ యువతి కుటుంబీకులు రాముడికి రెండో భార్యగా వివాహం చేశారు. దీంతో కొన్నాళ్లకు మొదటి భార్య దేవమ్మ (సౌమ్య) ఊరు విడిచి బతుకు దెరువు కోసం హైదరాబాద్ కు వలస కూలీగా వెళ్లింది. అయితే రెండో భార్య కొన్నాళ్లకు డెలివరీ అయి మగ బిడ్డకు జన్మనించింది.
సవతి కొడుకు బర్త్ డే కోసం వచ్చి...
తనకు వారసుడు పుట్టి సంవత్సరం కావడంతో బర్త్ డే ఫంక్షన్ చేయాలని తలారి రాముడు భావించాడు. బర్త్ డే ఫంక్షన్ ఈనెల (జూన్) 4వ తేదీ చేసేందుకు నిర్ణయించుకున్నాడు. దీంతో తలారి రాముడు హైదరాబాద్ లో ఉంటున్న మొదటి భార్య దేవమ్మ (సౌమ్య) వద్దకు వెళ్ళి కారులో ఎల్లూర్ గ్రామానికి 3వ తేదీన తీసుకొచ్చాడు. 4వ తేదీన రాత్రి గ్రాండ్ గా తన కొడుకు బర్త్ డే ఫంక్షన్ జరిపారు. అయితే అదే రాత్రి దేవమ్మ తో గొడవ జరిగిందని,దీంతో అవమానం భరించలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని గ్రామస్తులు తెలిపారు. కానీ ఆమె మృతిని భర్త అనుమానాస్పదంగా చిత్రీకరించాడు. ఒకరోజు గడిచిన తర్వాత బుధవారం పోలీస్ స్టేషన్ లో ఆమె ముగ్గురు సోదరులు తమ సోదరి మృతికి భర్తనే కారణమని నిర్ధారించుకొని తలారి రాముడే పై ఫిర్యాదు చేశారు. దీంతో శవాన్ని పోస్టుమార్టం కోసం కొల్లాపూర్ కు తరలించి కేసు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.






