- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయనగరంలో వింతదొంగ...చోరీ చేసి ఇంట్లోనే నిద్రపోయాడు!
సాధారణంగా చోరీ చేస్తే దొంగలు అక్కడ నుండి వీలైనంత త్వరగా పారిపోతారు. దొరికినంతా దోచుకుని సీసీ కెమెరాలకు కూడా చిక్కకుండా మాయం అవుతారు.

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా చోరీ చేస్తే దొంగలు అక్కడ నుండి వీలైనంత త్వరగా పారిపోతారు. దొరికినంతా దోచుకుని సీసీ కెమెరాలకు కూడా చిక్కకుండా మాయం అవుతారు. కానీ ఓ దొంగ దొంగతనానిని వచ్చి హ్యాపీగా పడుకున్నాడు. పాపం రాత్రంతా నైట్ షిష్ట్ చేశాడో ఏమో కానీ ఇంట్లో వాళ్లు వచ్చి తలుపు తీసినా కదలకుండా మొద్దునిద్రలో ఉన్నాడు. దీంతో అతడిని పట్టుకుని దోచుకున్నది తిరిగి లాక్కున్నారు. ఈ ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో చోటు చేసుకుంది.
పట్టణానికి చెందిన సీర శ్రీనివాసరావు అనే వ్యక్తి వ్యవసాయ పనుల నిమిత్తం కుటుంబంతో కలిసి సొంతూరుకు వెళ్లాడు. ఇంటికి తాళం ఉండటంతో దానిని పగలగొట్టి దర్జాగా ఇంట్లోకి ప్రవేశించిన దొంగ అక్కడే మకాం వేశాడు. మూడు రోజుల పాటు అదే ఇంట్లో ఉన్నాడు. దొరికిన వస్తులు అమ్ముకుంటూ వాటితో మద్యం తాగి తన సొంత ఇంటిలా అక్కడే ఉండిపోయాడు. ఈ క్రమంలో అతడిని గమణించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంటి యజమాని, పోలీసులు వచ్చి చూసేసరికి దర్జాగా ఇంట్లో పడుకుని ఉండటంతో దోచుకున్నది కక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.






