- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్నను నరికి చంపిన తమ్ముడు... కారణం అదే..
by Batti.Sumithra |
హన్మకొండలో దారుణం జరిగింది. క్షణికావేశంలో అన్నను తమ్ముడు నరికిచంపిన ఘటన కుమార్‌పల్లిలో చోటుచేసుకుంది.

X
దిశ, హనుమకొండ టౌన్ : హన్మకొండలో దారుణం జరిగింది. క్షణికావేశంలో అన్నను తమ్ముడు నరికిచంపిన ఘటన కుమార్‌పల్లిలో చోటుచేసుకుంది. కుమార్‌పల్లిలోని బుద్ధభవన్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గొర్రె శంకర్, గొర్రె రాజ్‌కుమార్‌కు మధ్య గొడవ జరిగింది. దీంతో అన్న గొర్రె శంకర్‌ను తమ్ముడు గొర్రె రాజ్ కుమార్ గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశాడు. కాగా అన్నదమ్ములు ఇద్దరూ అవివాహితులని, తమ్ముడు వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటంతో అన్నమందలించాడని ఈ క్రమంలోనే కోపంతో అన్నను తమ్ముడు హత్య చేశాడని స్థానికులు పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






