- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
పుట్టినరోజునే తనువు చాలించిన యువకుడు..
by Kalyani |
X
దిశ, నారాయణపేట ప్రతినిధి: తన పుట్టినరోజునే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంఘటన దామరగిద్ద మండల పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి మద్దెలబీడు గ్రామానికి చెందిన కంపిలి చరణ్(30) వ్యవసాయం చేస్తాడు. రోజువారి మాదిరిగానే ఇంటి నుంచి బయటకు వెళ్లిన చరణ్ ఆకస్మత్తుగా నిర్మానుష్య ప్రదేశంలో చెట్టుకు ఉరేసుకొని విగతజీవిగా కనిపించాడు.
విషయం గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని బోరున విలపించారు. మృతుడికి భార్య, కూతురు ఉంది. తన పుట్టిన రోజునే చరణ్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నీరయ్యారు. కాగా చరణ్ ఎందుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలియరాలేదు.
Advertisement
Next Story