- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విషాదం.. మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య
మద్యానికి బానిసై ఓ యువకుడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

X
దిశ, మల్యాల: మద్యానికి బానిసై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నూకపెళ్లి గ్రామానికి చెందిన ఓలపు గణేష్ (33) కూలి పని చేసుకుంటూ జీవించేవాడు. కాగా, గణేష్ మద్యానికి బానిసై.. నిత్యం ఇంట్లో వారితో, స్థానికులతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో డిసెంబర్ 24వ తేదీన తన గదిలో నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన గణేష్ తల్లి దేవక్క స్థానికుల సహయంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడటంతో గణేష్ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు మల్యాల ఎస్ఐ మంద చిరంజీవి తెలిపారు.
- Tags
- Suicide
Next Story






