విజయశాంతిరెడ్డి సూసైడ్ కేసు.. వీడని ఆ ఒకే ఒక్క మిస్టరీ

by Kema Shiva Kumar |

మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌కు చెందిన మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

విజయశాంతిరెడ్డి సూసైడ్ కేసు.. వీడని ఆ ఒకే ఒక్క మిస్టరీ
X

దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌కు చెందిన మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విజయశాంతి రెడ్డి (Vijayashanti Reddy) తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసినప్పటికీ చిక్కుముడులు మాత్రం వీడటం లేదు. కేసులో పోలీసులు ఇప్పటి వరకు దాదాపు 100 సీసీ కెమెరాల (CCTV Cameras)ను పరిశీలించారు. ఆమె ఇంటి నుంచి రైల్వే ట్రాక్ వరకు ఏ రూట్లో వెళ్లారు..? ఆ సమయంలో ఆమెతో ఎవరైనా ఉన్నారా..? అన్న కోణంలో విజువల్స్ పరిశీలించినప్పటికీ, కేసును మలుపు తిప్పే బలమైన క్లూ ఏదీ పోలీసులకు లభించలేదు. ఇప్పటి వరకు ఆమెకు సన్నిహితంగా ఉండే 20 మందిని పోలీసులు విచారించారు.

నేడు విజయశాంతి రెడ్డి ఇంటికి రైల్వే పోలీసులు

రైల్వే పోలీసు (Railway Police)లు నేడు విజయశాంతి రెడ్డి నివాసానికి వెళ్లనున్నారు. ఘటనా స్థలంలో పెద్దగా ఆధారాలు దొరకకపోవడంతో, ఇంట్లో ఏవైనా డైరీలు, లేఖలు లేదా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ దొరుకుతాయేమోనని పోలీసులు భావిస్తున్నారు. గత నెల 30న అర్ధరాత్రి తన ఇద్దరు పిల్లలు చేతన రెడ్డి (18), విశాల్ రెడ్డి (17)లతో కలిసి ఆమె చర్లపల్లి - ఘట్‌కేసర్ మధ్య రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

పిల్లలను ఎలా ఒప్పించారు?

ఈ కేసులో అత్యంత విషాదకరమైన మిస్టరీగా మారిన అంశం ఏమిటంటే.. ఎదిగిన ఇద్దరు పిల్లలను ఆమె ఎలా ఒప్పించారనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగింది. అర్ధరాత్రి వేళ రైల్వే ట్రాక్ దగ్గరికి తీసుకువెళ్లేటప్పుడు పిల్లలకు ఏం చెప్పారు.. వారిద్దరికీ ఏదైనా మత్తు పదార్థం ఇచ్చారా..? లేక వారే ఇష్టపూర్వకంగా తల్లి వెంట వెళ్లారా? అనేది పోలీసులకు క్లారిటీ రావాల్సి ఉంది.

Next Story