- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమ్మకానికి బంగారం "బిస్కెట్" టెస్టింగ్ పేరుతో భారీ మోసం !
వ్యాపారి నుంచి బంగారం బిస్కెట్ కొంటానని, టెస్టింగ్ చేసుకొస్తానని పరారైన కేటుగాళ్లు 24 గంటలో పట్టుబడ్డారు.

దిశ, ఘట్కేసర్: వ్యాపారి నుంచి బంగారం బిస్కెట్ కొంటానని, టెస్టింగ్ చేసుకొస్తానని పరారైన కేటుగాళ్లు 24 గంటలో పట్టుబడ్డారు. ఈ ఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాల్లోకి వెళితే...యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం పడమటి సోమారం గ్రామానికి చెందిన వ్యాపారి అల్వా అజయ్ రెడ్డి (30) ఈ నెల 23న అమీర్ పేట్ లోని ఎంజే ఎంటర్ ప్రైజెస్ లో 83 గ్రాముల బంగారు బిస్కెట్ కొనుగోలు చేసి ఇంటికి బయలుదేరాడు. అదే సమయంలో అతని స్నేహితుడు పరమేష్ కు ఫోన్ చేసి, తన వద్ద ఉన్న బంగారు బిస్కెట్, విక్రయిస్తానని చెప్పాడు.
అయితే పరమేష్ తనకు తెలిసిన వ్యక్తి కొనుగోలు చేస్తాడని చెప్పాడు. ఈ తరుణంలోనే ప్రవీణ్ అనే వ్యక్తి వ్యాపారి అల్వా అజయ్ రెడ్డికి ఫోన్ చేసి పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత అల్వా అజయ్ రెడ్డి దగ్గరి బంగారు బిస్కెట్ తీసుకున్నాడు ప్రవీణ్. బంగారం టెస్టింగ్ చేసుకొస్తానని నమ్మించి చెప్పి కారులో వెళ్లిపోయాడు. దీంతో ప్రవీణ్ తిరిగి రాకపోవడంతో అజయ్ రెడ్డి కంగుతిన్నాడు. రెండు రోజులైనా ప్రవీణ్ ఆచూకీ లభించకపోవడంతో, ఘట్కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు అల్వా అజయ్ రెడ్డి. ఈ తరుణంలోనే ప్రవీణ్ తో పాటు మరో వ్యక్తిని ఘట్కేసర్ పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆ నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం కోర్టులో సమర్పించనున్నట్లు సమాచారం. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.






