- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సికింద్రాబాద్ ఇన్సిడెంట్: ఆ తండ్రీకొడుకులతో పాటు మరో ఇద్దరు అరెస్ట్
by GSrikanth |
సికింద్రాబాద్ రూబీ హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై టాస్క్‌ఫోర్స్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ రూబీ హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై టాస్క్‌ఫోర్స్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో నిబంధనలకు విరుద్ధంగా బైకు షోరూమ్ నడుపుతోన్న యజమాని రంజిత్‌సింగ్ బగ్గా, ఆయన కుమారుడు సుమిత్ సింగ్ బగ్గాతో పాటు రూబీ హోటల్ మేనేజర్ సుదర్శన్ నాయుడు, సూపర్‌వైజర్‌ను అరెస్ట్ చేశారు. మేడ్చల్‌లోని ఫామ్‌హౌజ్‌లో రంజిత్ సింగ్, సుమిత్ తలదాచుకున్న విషయం తెలుసుకున్న పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం అరెస్ట్ చేశారు. కాగా, ఈ అగ్నిప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది సజీవదహనమైన సంగతి తెలిసిందే. మంటలు పై అంతస్తులో ఉన్న రూబీ లాడ్జికి వ్యాపించడంతో ఒకటి, రెండు ఫ్లోర్లలో ఉన్నవారు ఊపిరాడక చనిపోయారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు.
Next Story






