ఐ-బొమ్మ రవి విచారణ.. ఆ విషయాలు బయటకు రాకుండా జాగ్రత్తలు!

by Gantepaka Srikanth |

ఐ-బొమ్మ రవి విచారణ.. ఆ విషయాలు బయటకు రాకుండా జాగ్రత్తలు!

ఐ-బొమ్మ రవి విచారణ.. ఆ విషయాలు బయటకు రాకుండా జాగ్రత్తలు!
X

దిశ, సిటీక్రైం: ఐ-బొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి పైరసీ అక్రమాల గుట్టును చేధించేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్న పోలీసులు రెండు రోజు విచారణను పూర్తి చేశారు. పోలీసు వర్గాల విశ్వసనీయ సమచారం ప్రకారం.. పోలీసులు నమోదు చేసిన అభియాగాలకు సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో ఇమ్మడి రవిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రవి నుంచి సేకరించిన ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్‌లకు సంబంధించిన పాస్ వర్డ్‌లను సేకరించి వాటిని జల్లెడపడుతున్నారు. ఇమ్మడి రవి చీకటి రహస్యాలు మొత్తం వెలికి తీయడానికి ఈ ఐదు రోజుల కస్టడీ సరిపోదని మరోసారి కస్టడీకి అవసరం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

దీని కోసం రవిపై నమోదైన నాలుగు ఎఫ్ఐఆర్‌లకు అనుగుణంగా అతనిని పీటీ వారెంట్‌ల మీద అరెస్టు చేసి వాటిలో కూడా పోలీసులు చట్టప్రకారం కస్టడీ తీసుకుని దర్యాప్తు చేయనున్నారు. రవి నేర ప్రక్రియను నిర్ధారించడానికి పోలీసులు సర్వర్‌లు ఏర్పాటు చేసుకున్న సంస్థలతో పాటు అతను టెలిగ్రాం ద్వారా అప్ లోడ్ అయిన పైరసీ సినిమాలను కొనుగోలు చేయడం, క్రిప్టో కరెన్సీ ద్వారా జరిపిన లావాదేవీలు, వెబ్ సైట్‌లు, డొమైన్‌ల గురించి తెలుసుకోవడానికి పోలీసులు సంబంధిత సంస్థలకు లేఖలు రాస్తున్నారు. ఐ-బొమ్మ కస్టడీ విచారణ విషయాలు బయటికి రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Next Story