- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుండంలో దూకి పూజారి, అతని కొడుకు ఆత్మహత్య
బండ గుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని గుండంలో దూకి వరయూరు లక్ష్మి నరసింహ చార్యులు (40), అతని కొడుకు పవన కుమారాచార్యులు(20) ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని బండ్లగూడ గ్రామంలో చోటు చేసుకుంది.

దిశ, లింగాలఘణపురం : నిత్యం దేవుని పూజించే పూజారికి ఏం కష్టం వచ్చిందో కానీ.. తన కొడుకుతో కలిసి రోజు పూజ చేసే బండ గుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని గుండంలో దూకి వరయూరు లక్ష్మి నరసింహ చార్యులు (40), అతని కొడుకు పవన కుమారాచార్యులు(20) ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని బండ్లగూడ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని బండగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఏడు సంవత్సరాల క్రితం ధూప దీపం నైవేద్యం కింద అర్చకులుగా నియమితులయ్యారని, మండల కేంద్రంలో భార్య శ్రీదేవి, కుమారుడు పవనకుమారాచార్యులతో నివాసం ఉంటున్నారు. అప్పటి నుంచి రోజు బండ్లగూడెంలోని లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో నిత్య పూజలు చేస్తూ ఉండేవారన్నారు.
గత నెల పూజారి భార్య శ్రీదేవి మృతి చెందినట్లు తెలిపారు. అప్పటి నుంచ,ఇ తండ్రి,కొడుకులు దిగులుతో ఉంటూ, మానసికంగా ఇబ్బంది పడేవారని, మేము కూడా బతికి ఉండడం ఎందుకని దిగులుతూ ఉండేవారని తెలిపారు. బుధవారం నుంచి తండ్రి కొడుకులు కనిపించకుండా పోయారని, శుక్రవారం బండగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని గుండంలో శవాలుగా కనిపించినట్టు తెలిపారు. తండ్రి కొడుకులు ఎప్పుడు కలిసి గుడికి వచ్చేవారని, మృతిలోని వారి బంధం వీడలేదన్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే పూజారి మృతుని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. సంఘాల స్థలానికి డిసిపి రాజమహేంద్ర నాయక్, సీఐ శ్రీనివాస్ రెడ్డి ఎస్ఐ శ్రావణ్ కుమార్ చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకుంటే తెలిపారు.






