- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
by Ratna Kumari |
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు.

X
దిశ, మక్తల్ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఊట్కూరు మండలం మల్లెపల్లి గ్రామానికి చెందిన అయ్యన్న జనవరి 01న మక్తల్ కి వస్తుండగా.. పట్టణ శివారులోని కాటన్ మిల్లు వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీ కొన్నాయి. దీంతో అయ్యన్న తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి తొలుత మక్తల్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. ఈ ప్రమాదం పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం మక్తల్ ఆసుపత్రికి తరలించారు.
Next Story






