అదుపు తప్పి ఆటో బోల్తా.. వ్య‌క్తి మృతి

by Nallavelli.Anjaneyulu |

అదుపు తప్పి ఆటో బోల్తా పడి వ్య‌క్తి మృతి చెందిన ఘటన తాజాగా మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది.

అదుపు తప్పి ఆటో బోల్తా.. వ్య‌క్తి మృతి
X

దిశ‌, మంథ‌ని : అదుపు తప్పి ఆటో బోల్తా పడి వ్య‌క్తి మృతి చెందిన ఘటన తాజాగా మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. భూపాలపల్లి నుంచి మంథని వైపు వస్తున్నా ఆటో గాడిదుల గండి మూల మలుపు వద్ద అదుపు తప్పి పక్కనే ఉన్న పొదల్లో బోల్తా పడింది. దీంతో ఒకరు అక్కడిక్కడే మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుల‌ను వైద్యం అందించడానికి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. సమాచారం అందుకున్న మంథని పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

Next Story