- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వీడిన పోచారం కాల్పుల మిస్టరీ..
గో సంరక్షణ కార్యకర్త సోను అలియాస్ ప్రశాంత్ సింగ్ ను హత్య చేసేందుకు పాతబస్తీకి చెందిన ఇబ్రహీం మరో ముగ్గురితో కలిసి కుట్ర పన్నారని రాచకొండ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది.

దిశ, సిటీ క్రైమ్ : గో సంరక్షణ కార్యకర్త సోను అలియాస్ ప్రశాంత్ సింగ్ ను హత్య చేసేందుకు పాతబస్తీకి చెందిన ఇబ్రహీం మరో ముగ్గురితో కలిసి కుట్ర పన్నారని రాచకొండ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది. బుధవారం రాత్రి పోచారం పోలీస్ స్టేషన్ పరిధి ఘట్కేసర్ ప్రాంతంలో కాల్పుల సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కాల్పులకు పాల్పడిన ముగ్గురిని పోలీసులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారని సమాచారం.
20 లక్షలు నష్టం..
ఇబ్రహీం అనే వ్యక్తి గోవులను తరలించేందుకు మొత్తం 11 వాహనాలను ఉపయోగిస్తూ ఉండేవాడు. ఒక వారంలోనే ప్రశాంత్ అనే వ్యక్తి ఇబ్రహీంకు చెందిన 7 వాహనాలను పట్టించాడు. దీంతో ఇబ్రహీంకు 20 లక్షలు నష్టం రావడంతో ఇబ్రహీం ప్రశాంత్ మీద కోపం పెంచుకుని అతనిని హత్య చేసేందుకు తన స్నేహితులైన అజ్జు, శ్రీనివాస్, మరొకరితో స్కెచ్ వేశాడు. ఈ నేపథ్యంలోనే శ్రీనివాస్ తో ప్రశాంత్ కు గోవుల తరలింపు సమాచారం ఉందని ఘట్కేసర్ ప్రాంతానికి పిలిపించి కాల్పులు జరిపారని తెలిపారు. ఆ తర్వాత నిందితులు నేరుగా హైదరాబాద్ వైపు పరారైనట్లు సీసీ కెమెరాలు ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు తెలుసుకుని గంటల వ్యవధిలోనే ముగ్గురుని పట్టుకున్నారు. ఐతే పట్టుబడ్డ నిందితులు ప్రశాంత్ వల్ల తమ వ్యాపారం నష్టపోతుండడంతో పాటు నెలకు 2 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు పోలీసులకు తెలిపినట్లు ప్రచారం జరుగుతుంది. మరో వైపు నిందితులు గోవులను ఎక్కడి నుంచి అపహరిస్తున్నారు, ఎలా చోరీ చేస్తున్నారు, ప్రశాంత్ ను హత్య చేసేందుకు తుపాకీ ఎక్కడి నుంచి కొన్నారు, ఇంకా వారి వద్ద ఎన్ని తుపాకులు ఉన్నాయి వంటి వివరాలు బయట పడాల్సి ఉంది. నిందితులను మధ్యాహ్నం పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మీడియా ముందు ఉంచి వివరాలను తెలుపనున్నారు.
Read More: పోచారం కాల్పుల కేసులో పురోగతి.. ముగ్గురు నిందితుల అరెస్టు






