- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొడుకు చనిపోయాడని తట్టుకోలేక గుండెపోటుతో తల్లి మృతి
కొడుకు మృతిని తట్టుకోలేక తల్లి గుండెపోటుతో మృతి చెందింది. ఈ విషాదకర ఘటన బుధవారం జగిత్యాల మండలం మోతా గ్రామంలో చోటు చేసుకుంది.

దిశ, జగిత్యాల రూరల్ : కొడుకు మృతిని తట్టుకోలేక తల్లి గుండెపోటుతో మృతి చెందింది. ఈ విషాదకర ఘటన బుధవారం జగిత్యాల మండలం మోతా గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల మండలం మోతె గ్రామానికి చెందిన దొడ్ల సంపత్ వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. గత కొద్ది రోజుల కిందట వ్యవసాయ పనుల కోసం, ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పును తీర్చలేకపోతున్నాననే బాధతో మంగళవారం సాయంత్రం గడ్డి మందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. తన కొడుకు చనిపోయాడని తట్టుకోలేక ఆ తల్లి గుండె ఆగిపోయింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. కొడుకు మరణించిన కొద్ది గంటల్లోనే తల్లికూడా చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.






