- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వృద్ధురాలి మెడలో బంగారం లాక్కెళ్లిన వ్యక్తి.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
ఓ వృద్ధురాలి మెడలో నుంచి ఓ వ్యక్తి బంగారు గొలుసు లాక్కొని పారిపోయిన సంఘటన బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

దిశ, కంటోన్మెంట్/బోయిన్ పల్లి: ఓ వృద్ధురాలి మెడలో నుంచి ఓ వ్యక్తి బంగారు గొలుసు లాక్కొని పారిపోయిన సంఘటన బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్ స్పెక్టర్ రవి కుమార్, డీఐ. శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. జనగామకు చెందిన భ్రమరాంబ న్యూ బోయిన్ పల్లి పరిధి కంసారి బజార్ లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ కిరాణ దుకాణం నడిపిస్తూ ఒంటరిగా జీవనం సాగిస్తుంది. కాగా ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి దుకాణంలోకి వర్షం నీరు వచ్చి చేరింది. దీంతో సోమవారం తెల్లవారుజామున ఆ నీరును బయటకు తోడుతుండగా ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలో ఉన్న 2.5 తులాల బంగారం గొలుసును లాక్కుని పారిపోయాడు.
దీంతో బోయిన్ పల్లి పోలీసులుకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని రెండు టీంలుగా విడిపోయి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఘటన జరిగిన ప్రాంతం నుంచి కొద్ది దూరంలో ఉన్న సీసీ ఫుటేజ్ లో పలువురు అనుమానితులను అదుపులో తీసుకున్నారు. కాగా బాధితురాలు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం అదే ప్రాంతానికి చెందిన నిఖిలేష్ (22)పై అనుమానం రావడంతో నిఖిలేష్ ను విచారించగా తానే చైన్ స్నాచింగ్ చేశానని ఒప్పుకున్నాడు. పోలీసులు బంగారం గొలుసు, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. నిఖిలేష్ ను రిమాండ్ కు తరలించారు.






