1000 కుక్కలకు నరకం చూపించి చంపిన వ్యక్తి

by Disha Web Desk 7 |
1000 కుక్కలకు నరకం చూపించి చంపిన వ్యక్తి
X

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ కొరియాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి దాదాపుగా 1000 కుక్కలకు తిండి పెట్టకుండా నరకం చూపించి చనిపోయేలా చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్‌లు ఈ విధంగా మాట్లాడారు. దాదాపుగా 1000 కుక్కలు పునరుత్పత్తి వయసును దాటేసిన కారణంగా డాగ్ బ్రీడర్స్ వాటిని వదిలించుకోవడానికి 2020 నుంచి ఓ వ్యక్తికి అప్పగించారు. అంతేకాకుండా వాటిని సంరక్షించేందుకు ఆ వ్యక్తికి ఒక్కో కుక్కకి 10 వేల వొన్‌ల చొప్పున చెల్లించినట్లు పేర్కొన్నారు. కానీ సదరు వ్యక్తి ఆ కుక్కలకు తిండి పెట్టకుండా ఓ చోట నిర్భందించి చనిపోయేలా చేశాడు. కాగా.. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా నిందితుడు తాను చేసిన నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు తెలిపారు.


Next Story

Most Viewed