దుండిగల్ లో యువకుడి దారుణ హత్య

by Dishafeatures2 |
దుండిగల్ లో యువకుడి దారుణ హత్య
X

దిశ, దుండిగల్: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిదోలోని జ్యోతి మిల్క్ సమీపంలో ఓ యువకుడు దారుణంగా హత్యకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు, దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ కాశిబుగ్గకు చెందిన లత, సదానందం భార్యాభర్తలు. ఉపాధి కోసం నగరానికి వచ్చి సూరారం కాలని లక్ష్మీ నగర్ లో ఉంటున్నారు. వారికి కుమారుడు వినయ్(26), కూతురు రోజీ ఉన్నారు. కుటుంబ తగాదాల వల్ల భార్యాభర్తలు వేరువేరుగా ఉంటున్నారు. తల్లి ఇళ్లలో పనులు చేస్తూ కుటుంబాన్ని పోసిస్తోంది. కుమారుడు వినయ్ దూలపల్లి లోని ఫ్యాన్ల తయారీ పరిశ్రమలో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. గంజాయికి బానిసై కొంతకాలంగా స్నేహితులతో కలిసి జులాయిగా తిరుగుతున్నట్లు సమాచారం.

మృతుడు గతంలో బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అత్యాచారం కేసులో నిందితుడు. అంతేకా కాక ఇటీవల ఓ అమ్మాయిని 6 నెలల క్రితం ప్రేమించినట్లు సమాచారం. ఈ నెల 7న హోలీ సందర్భంగా స్నేహితులతో కలిసి హొలీ ఆడి రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చినట్లు సమాచారం. అదే రోజు రాత్రి నలుగురు స్నేహితులు ఇంటికి వచ్చి బలవంతంగా తీసుకువెళ్లినట్లు మృతుని తల్లి ఆరోపిస్తుంది. ఈ నెల 8 న తెల్లవారుజామున 3 గంటలకు హత్య గురై ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పథకం ప్రకారం హత్య చేశారు లేక గంజాయి మత్తులో మాటా, మాటా పెరిగి హత్య జరిగిందా తేలాల్సి ఉంది.కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీస్ లు మృతదేహాన్ని గాంధీ మార్చరీకి తరలించి కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.

పథకం ప్రకారమే హత్య చేశారు..?

మృతుడు వినయ్ ని పథకం ప్రకారం హత్య చేశారా అంటే అవును అనే సమాధానమే వస్తోంది. హత్యకు ముందు తనను చంపుతామంటూ వినయ్ కు బెదిరింపు కాల్స్, మెసేజ్ లు వచ్చాయి. 6 నెల క్రితం ఓ అమ్మాయిని ప్రేమించిన మృతుడు.. ఇటీవలే ఆమెకు బ్రేకప్ చెప్పినట్లు సమాచారం. మృతుడు వినయ్ ని రాత్రి 11 గంటలకు అతని స్నేహితులు ఉదయ్, టామ్, ధనుష్ లు బలవంతంగా తీసుకు వెళ్లినట్లు తల్లి ఆరోపిస్తోంది. హత్యలో 5 నుండి 6 గురు పాల్గొని ఉంటారని పోలీస్ లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని పతిశీలించిన ఏసీపీ వెంకట రెడ్డి హత్య జరిగి రెండు రోజులు అయి ఉంటుందని, కుటుంబ సభ్యులు ఆరోపుస్తున్న ప్రకారం ఓ పథకం ప్రకారమే హత్య జరిగి ఉండవచ్చవన్నారు. విచారణ జరిపి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed