పెళ్లైన రెండో రోజే వరుడు మృతి.. కారణం అదేనా?

by Muthe.Rajitha |

పెళ్లి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వివాహం జరిగిన రెండో రోజే వరుడు మృత్యువు పాలవడంతో ఇరు కుటుంబాలు శోక సముద్రంలో మునిగిపోయాయి.

పెళ్లైన రెండో రోజే వరుడు మృతి.. కారణం అదేనా?
X

దిశ, వెబ్ డెస్క్ : పెళ్లి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వివాహం జరిగిన రెండో రోజే వరుడు మృత్యువు పాలవడంతో ఇరు కుటుంబాలు శోక సముద్రంలో మునిగిపోయాయి. రంగారెడ్డి జిల్లాలోని బడంగ్ పేటలోని లక్ష్మీదుర్గ కాలనీకి చెందిన విశాల్(25)కు ఈనెల 7న అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. అయితే నిన్న వధువు ఇంట్లో పూజ కార్యక్రమాలు ముగించుకొని తెల్లవారుజామున ఇంటికి చేరుకున్నాక, అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఇంట్లో కుప్పకూలి పోయాడు. కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించగా.. అక్కడ సరైన వైద్యసదుపాయాలు లేకపోవడంతో మరో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగానే.. పరిస్థితి విషమించి మృతి చెందాడు.

పెళ్ళైన రెండు రోజులకే భర్త మరణించడంతో వధువు రోదనలు చూసే వారిని కంటతడిపెట్టించాయి. కుటుంబసభ్యులు, బంధువుల ఏడుపులతో ఆసుపత్రి దద్దరిల్లు పోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.

Next Story