- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనుమానస్పద స్థితిలో బాలిక మృతి..
అనుమానస్పద స్థితిలో బాలిక మృతిచెందిన సంఘటన మండలంలోని ప్రోద్దటూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

దిశ, వలిగొండ : అనుమానస్పద స్థితిలో బాలిక మృతిచెందిన సంఘటన మండలంలోని ప్రోద్దటూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ప్రోద్దటూర్ గ్రామానికి చెందిన వడ్డేబోయిన గణేష్ అనితల పెద్ద కూతురు అక్షిత (17) ఇంటర్ చదువుతుంది. తల్లి, తండ్రి వారి వ్యవసాయ పనులపై భావి వద్దకు వెళ్లడంతో ఇంట్లో ఎవరులేని సమయంలో ఇంటి తలుపు గడియ వేసుకొని ఇంట్లోని ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
తండ్రి బావిదగ్గర నుండి ఇంటికి వచ్చే సరికి తలుపు గడియవేసి ఉండగా కిటికీలోంచి చూడగా తన కూతురు ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. తలుపు గడియ విరగొట్టి చూసే సరికి కూతురు మృతి చెందిందని. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై శ్యామ్ సుందర్ రెడ్డి తెలిపారు.






