- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పట్టాలు తప్పిన చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్.. ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం
ప్యాసెంజర్ రైలు పట్టాలు తప్పిన ఘటన ఒడిశాలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ప్యాసెంజర్ రైలు పట్టాలు తప్పిన ఘటన ఒడిశా (Odisha)లో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. న్యూ జల్పాయ్‌గురి (New Jalpaiguri) నుంచి చెన్నై (Chennai) వెళ్తున్న ట్రైన్ నెంబర్ 22612, చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ జాజిపూర్ (Jajipur) జిల్లాలోని జఖపురా స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో ఒక ఏసీ కోచ్, రెండు జనరల్ కోచ్‌లు ట్రాక్ నుంచ ఓ పక్కకు ఒరిగాయి. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అందరూ సురక్షితంగా ఉన్నారని రైల్వే అధికారులు ధృవీకరించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే భద్రక్ నుంచి సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పట్టాలు తప్పిన కోచ్‌లలోని ప్రయాణికులను ఇతర బోగీల్లోకి పంపి వారిని తమ గమ్యస్థానాలకు చేరవేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రమాదం కారణంగా న్యూ జల్పాయ్‌గురి - చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం కలిగింది.






