ఆటోను ఢీ కొట్టిన కారు.. ప‌సికందు మృతి

by Ratna Kumari |

ఆటోను కారు ఢీ కొట్ట‌డంతో ప‌సి కందు మృతి చెందింది. ఈ ఘ‌ట‌న మెట్ ప‌ల్లి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

ఆటోను ఢీ కొట్టిన కారు.. ప‌సికందు మృతి
X

దిశ‌, మెట్ ప‌ల్లి : ఆటోను కారు ఢీ కొట్ట‌డంతో ప‌సి కందు మృతి చెందింది. ఈ ఘ‌ట‌న మెట్ ప‌ల్లి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్సై కిర‌ణ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మెట్ ప‌ల్లి ప‌ట్ట‌ణానికి చెందిన షేక్ సుమీర్ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి TG21T0532 నెంబర్ గల ఆటోలో కోరుట్ల పట్టణానికి గురువారం రాత్రి షాపింగ్ కు వెళ్తుండగా.. AP09 CL 8044 అనే కారు అతి వేగంగా వచ్చి ఆటోను వెనకాల నుంచి ఢీ కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలో నెల రోజుల పసికందు మృతి చెందింది.షేక్ సుమీర్ ఫిర్యాదు మేరకు ఎస్సై కిరణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story