రిజ‌ర్వాయ‌ర్ లోకి దూసుకెళ్లిన కారు.. డ్రైవ‌ర్ మృతి

by Ratna Kumari |

ప్ర‌మాద‌వ‌శాత్తు ఓ కారు ప‌ల్టీలు కొట్టి.. రిజ‌ర్వాయ‌ర్ లోకి దూసుకెళ్లింది. కారు డ్రైవ‌ర్ మృతి చెందాడు. కారులో ఉన్న మ‌రో యువ‌కుడు తీవ్ర గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు.

రిజ‌ర్వాయ‌ర్ లోకి దూసుకెళ్లిన కారు.. డ్రైవ‌ర్ మృతి
X

దిశ‌, ధ‌ర్మ‌సాగ‌ర్ : ప్ర‌మాద‌వ‌శాత్తు ఓ కారు ప‌ల్టీలు కొట్టి.. రిజ‌ర్వాయ‌ర్ లోకి దూసుకెళ్లింది. దీంతో డ్రైవ‌ర్ మృతి చెందాడు. కారులో ఉన్న మ‌రో యువ‌కుడు తీవ్ర గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న జ‌న‌గామ జిల్లా స్టేష‌న్ ఘ‌న‌పూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. స్టేష‌న్ ఘ‌న‌పూర్ ప్రాంతంలో షిప్ట్ కారు అదుపు త‌ప్పి రిజ‌ర్వాయ‌ర్ లోకి దూసుకెళ్లింది. ఈ ప్ర‌మాద స‌మ‌యంలో కారు అద్దాలు ప‌గ‌ల‌డంతో ధ‌రావ‌త్ చ‌ర‌ణ్(18) కి తీవ్ర గాయాల‌య్యాయి. అత‌ను అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లాడు. వెంట‌నే స్థానికులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కారు డ్రైవ‌ర్ భూక్య ప‌వ‌న్ ఆచూకి తొలుత ల‌భించ‌లేదు. ఆ త‌రువాత పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్ట‌గా.. ప‌వ‌న్ మృత‌దేహం ల‌భ్య‌మైంది. ఈ ఘ‌ట‌న‌తో అత‌ని కుటుంబ స‌భ్యులు క‌న్నీటి ప‌ర్వంత‌మ‌య్యారు. ప్ర‌మాదానికి కార‌ణాలు తెలియాల్సి ఉంది. దేశతండా ప‌రిస‌ర ప్రాంతంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.

Next Story