- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అయప్ప భక్తులు ప్రయాణిస్తున్న కారు బోల్తా
అయప్ప భక్తులు ప్రయాణిస్తున్న కారు బోల్తా

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి(Tirupati) జిల్లా చంద్రగిరి మండలం అగరాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అయప్ప భక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గాయాలైన వారిని పోలీసులు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. శబరిమల నుంచి కోడూరు తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, నిన్న కూడా అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న వాహనం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు రామేశ్వరం దర్శించుకుని తిరిగి వస్తుండగా.. రామనాథపురం జిల్లా కీజక్కరై వద్ద ఎదురుగా వస్తున్న మరో కారు వేగంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. కారులో ఉన్న ఐదుగురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇది జరిగి.. 24 గంటలు కూడా గడువకముందే మరో ప్రమాదం జరుగడం కలకలం రేపుతోంది.






