- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శోభనం గదిలో వధువు రెండు రోజులుగా.. తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించిన వరుడు
ఉత్తర ప్రదేశ్‌లోని ఈటాలో వింత ఘటన చోటుచేసుకుంది. ఈటాలోని జైతారా గ్రామానికి చెందిన ఓ యువకుడు ఢిల్లీకి చెందిన అమ్మాయిని కొన్ని రోజుల క్రితం పెళ్లి చేసుకున్నాడు..

దిశ, వెబ్ డెస్క్: ఉత్తర ప్రదేశ్‌లోని ఈటాలో వింత ఘటన చోటుచేసుకుంది. ఈటాలోని జైతారా గ్రామానికి చెందిన ఓ యువకుడు ఢిల్లీకి చెందిన అమ్మాయిని కొన్ని రోజుల క్రితం పెళ్లి చేసుకున్నాడు. అయితే వివాహం అయిన మొదటి రాత్రి వధువు అతడితో శారీరక సంబంధానికి నిరాకరించింది. రెండోరోజు కూడా ముభావుగా ఉండటంతో వరుడు పెళ్లి కార్యక్రమాల్లో భాగంగా అలసిపోయిందని అనుకున్నాడు.
ఆ తర్వాత అనుమానం వచ్చి గట్టిగా యువతిని నిలదీశాడు. దీంతో వధువు షాకింగ్ విషయం చెప్పింది. తానొక ట్రాన్స్‌జెండర్ అని ఆ విషయాన్ని దాచిపెట్టి తమ తల్లిదండ్రులు పెళ్లి జరిపించారని చెప్పింది. అసలు విషయం తెలుసుకున్న వరుడు షాక్‌కు గురయ్యాడు. వెంటనే ఆమెను పుట్టింటికి పంపి ఐదు రోజుల తర్వాత అమ్మాయి తరపు వారు వచ్చి వాళ్లు పెట్టిన అభరణాలు, కట్నంగా ఇచ్చిన డబ్బులు తీసుకెళ్లారు. అయితే వరుడు వాళ్ల ఇంటికి వెళ్లి తాను పెళ్లికి ఖర్చు పెట్టిన డబ్బులు ఇవ్వమని అత్తింటి వారిని నిలదీయడంతో అతడిపై దాడి చేశారు. చేసేదేమిలేక అతడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
Read more:






