లారీ ని ఢీ కొట్టిన బైకు.. వ్య‌క్తి మృతి

by Nallavelli.Anjaneyulu |

ముందుగా వెళ్తున్న లారీ ని వెనుక వైపు నుంచి బైకు అక‌స్మాత్తుగా ఢీ కొట్ట‌డంతో వ్య‌క్తి అక్క‌డికక్క‌డే మృతి చెందాడు. మ‌రో యువ‌కుడు తీవ్ర‌గాయాల‌తో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘ‌ట‌న కృష్ణ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

లారీ ని ఢీ కొట్టిన బైకు.. వ్య‌క్తి మృతి
X

దిశ‌, మ‌క్త‌ల్ : ముందుగా వెళ్తున్న లారీ ని వెనుక వైపు నుంచి బైకు అక‌స్మాత్తుగా ఢీ కొట్ట‌డంతో వ్య‌క్తి అక్క‌డికక్క‌డే మృతి చెందాడు. మ‌రో యువ‌కుడు తీవ్ర‌గాయాల‌తో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘ‌ట‌న కృష్ణ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. హైద‌రాబాద్ లో నివాసం ఉండే నేతాజీ(30) సంక్రాంతి పండుగ రోజు అత్తారింటికి వ‌చ్చి స‌ర‌దాగా రోడ్డు వ‌ర‌కు వెళ్లొద్దామ‌ని బావ‌మ‌రిది ఆకాశ్ తో బైకు పై బ‌య‌లు దేరాడు. కొద్ది దూరానికే లారీని ఢీ కొట్ట‌డంతో అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు నేతాజీ. ఈ ఘ‌ట‌న పై పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు. పోస్టు మార్టం కోసం మ‌క్త‌ల్ ఆసుప‌త్రికి నేతాజీ మృత‌దేహాన్ని త‌ర‌లించారు.

Next Story