- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తప్పించుకు తిరుగుతున్న నిందితుడు రిమాండ్
గంజాయి కేసులో కొంత కాలంగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని రిమాండ్కు తరలించారు.

X
దిశ, చందుర్తి : గంజాయి కేసులో కొంత కాలంగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని రిమాండ్కు తరలించారు. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం గతంలో ఇద్దరు వ్యక్తులు గంజాయి తరలిస్తుండగా మల్యాల గ్రామ శివారులో నిందితుడు చేపూరి రోహన్ పై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపామని తెలిపారు. మరో వ్యక్తి లింగంపేట గ్రామానికి చెందిన మేకల రాహుల్ అప్పటి నుండి పరారీలో ఉన్నాడు. శుక్రవారం నిందితుడు శంషాబాద్ ఎయిర్పోర్టులో ఉన్నాడని నమ్మదగిన సమాచారంతో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించినట్లు సీఐ తెలిపారు. యువత డ్రగ్స్ బారినపడి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దన్నారు. స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నట్టు చెప్పారు.
- Tags
- remand
Next Story






