బాంబులు పెడతామంటూ స్కూల్‌కి ఈమెయిల్.. జల్లెడ పడుతున్న పోలీసులు

by Web Desk |
బాంబులు పెడతామంటూ స్కూల్‌కి ఈమెయిల్.. జల్లెడ పడుతున్న పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ స్కూల్‌కి వచ్చిన ఈమెయిల్ స్థానిక పోలీసులకు పెద్ద సమస్యగా మారింది. స్థానికులందరినీ షాక్‌కు గురిచేసింది. థానే స్కూల్‌కు వచ్చిన ఈమెయిల్ ఆధారంగా పోలీసులు పూర్తి థానేను జల్లెడ పడుతున్నారు. స్కూళ్లు, కాలేజీలు, రైల్వే స్టేషన్లలో బాంబులు పెడుతున్నామని, థానే అంతటా విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నామంటూ ఆ మెయిల్‌లో ఉంది. దాంతో అలెర్ట్ అయిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అంతేకాకుండా ఈమెయిల్‌లో కేవలం మదర్సాలలో మాత్రమే విద్యాభ్యాసం సాగాలని ఉందని పోలీసు అధికారి తెలిపారు. అంతేకాకుండా భారతదేశమంతటా జీహాద్‌ను అనుసరించేలా చేయడమే తమ ప్రథమ లక్ష్యం అని అందులో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, ఇందులో పాల్పడిన వారు ఎవరైనా పట్టుకునితీరుతామని పోలీసులు తెలిపారు.


Next Story