మైనర్లతో ఇంటర్వ్యూలు చేసిన యూట్యూబర్ అరెస్ట్

by Ajay Maddhiboyina |

వైర‌ల్ హ‌బ్ 007 అనే ఛాన‌ల్ ద్వారా వీడియోలు చేస్తున్న కంబేటి స‌త్య‌మూర్తి అనే యాంక‌ర్ ను సైబ‌ర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

మైనర్లతో ఇంటర్వ్యూలు చేసిన యూట్యూబర్ అరెస్ట్
X

దిశ‌, వెబ్ డెస్క్: కొంత‌మంది క్రియేట‌ర్లు యూట్యూబ్ మ‌నీ కోసం, సోష‌ల్ మీడియాలో ఫేమ్ కోసం మైనర్లతో ఇంట‌ర్వ్యూలు చేస్తూ వారితో బూతులు మాట్లాడిస్తున్నారు. అలాంటి వాళ్ల‌కు హైద‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ ఇటీవ‌ల వార్నింగ్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా ఓ యూట్యూబ‌ర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైర‌ల్ హ‌బ్ 007 అనే ఛాన‌ల్ ద్వారా వీడియోలు చేస్తున్న కంబేటి స‌త్య‌మూర్తి అనే యాంక‌ర్ ను సైబ‌ర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

స‌త్య‌మూర్తి 15 నుండి 17ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు ఉన్న బాల‌బాలిక‌ల‌ను అస‌భ్య‌క‌ర ప్ర‌శ్న‌లు అడుగుతూ ఇంట‌ర్వ్యూ చేశాడు. ఓ ఇంట‌ర్వ్యూలో బాలిక బాలుడిని ముద్దు పెట్టుకునేలా సైతం ప్రేరేపించాడు. దీంతో ఈ ఘ‌ట‌న‌ను సుమోటోగా తీసుకుని కేసు న‌మోదు చేశారు. నిందితుడిని డిజిట‌ల్ ఎవిడెన్స్ తో అదుపులోకి తీసుకుని పోక్సో, ఐటీ చ‌ట్టాల కింద కేసు న‌మోదు చేశారు. పోలీసుల విచార‌ణ‌లో వ్యూవ్స్ పెంచుకునేందుకే అలాంటి ఇంట‌ర్వ్యూలు చేసిన‌ట్టు స‌త్య‌మూర్తి ఒప్పుకున్నాడు.

Next Story