ఆ వీడియోలను ఫార్వార్డ్ చేయకండి.. తెలంగాణ పోలీసుల హెచ్చరిక

by Gantepaka Srikanth |

సోషల్ మీడియా వాడకం పెరిగిన నాటి నుంచి అసలు ఏదో.. ఫేక్ ఏదో కనిపెట్టడం చాలా కష్టతరంగా మారుతోంది.

ఆ వీడియోలను ఫార్వార్డ్ చేయకండి.. తెలంగాణ పోలీసుల హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా వాడకం పెరిగిన నాటి నుంచి అసలు ఏదో.. ఫేక్ ఏదో కనిపెట్టడం చాలా కష్టతరంగా మారుతోంది. ముఖ్యంగా రోజూ ఎన్నో మార్ఫింగ్ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారుతుంటాయి. కొన్ని రోజుల క్రితం స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా డీప్‌ఫేక్ వీడియో ఎంతగా వైరల్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే రోజూ అనేక మార్ఫింగ్ వీడియోలు(Morphing Videos) సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఈ ఫేక్, మార్ఫింగ్ వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు(Telangana Police) సూచనలు చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘సోషల్ మీడియాలో కనిపించే వీడియోలన్నీ నిజాలు కాకపోవచ్చు. ప్రముఖుల వీడియోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మార్ఫింగ్ చేసి మోసాలు చేస్తున్నారు. కొన్ని కంపెనీలను ప్రమోట్ చేస్తున్నట్లు, పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నట్లు నమ్మిస్తారు జాగ్రత్త. ఇలాంటి వీడియోలను ఫార్వార్డ్ చేయకండి’ అని హెచ్చరించారు.

Next Story