టెర్రరిస్ట్ సాజిద్‌ అక్రమ్‌ది హైదరాబాదే.. TG డీజీపీ ఆఫీస్ ప్రకటన

by Gantepaka Srikanth |

టెర్రరిస్ట్ సాజిద్‌ అక్రమ్‌ది హైదరాబాదే.. TG డీజీపీ ఆఫీస్ ప్రకటన

టెర్రరిస్ట్ సాజిద్‌ అక్రమ్‌ది హైదరాబాదే.. TG డీజీపీ ఆఫీస్ ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో జరిగిన ఉగ్రదాడి ఘటన ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 16 మంది మృతిచెందగా.. 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే.. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాది సాజిద్‌ది హైదరాబాద్‌గా నిర్ధారించారు. తాజాగా తెలంగాణ డీజీపీ కార్యాలయం(Telangana DGP) సాజిద్‌పై క్లారిటీ ఇచ్చింది. సాజిద్ అక్రమ్(Terrorist Sajid Akram) హైదరాబాద్‌కు చెందిన వాడేనని స్పష్టం చేసింది. బీకామ్ చదివిన సాజిద్ అక్రమ్.. 27 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. ఓ యూరోపియన్ యువతిని పెళ్లి చేసుకున్నారు. ఆస్ట్రేలియాకు వలస వెళ్లిన తర్వాత.. 27 ఏళ్లలో కేవలం ఆరు సార్లే సాజిద్ భారత్‌కు వచ్చి వెళ్లాడు. ఇప్పటికీ భారత పాస్‌పోర్డునే వినియోగిస్తున్నాడు. సాజిద్‌కు ఒక కూతురు, కుమార్తె ఉంది. హైదరాబాద్‌లో ఉన్నన్ని రోజులు ఎలాంటి నేరాలకు పాల్పడలేదు. ఆస్ట్రేలియాలో స్థిరపడిన తర్వాతనే ఉగ్రవాదులతో పరిచయాలు పెంచుకోవడం, ఆ సంస్థల్లో పనిచేయడం వంటివి చేశాడు. ఇదే విషయమై హైదరాబాద్‌లో ఉంటున్న సాజిద్ కుటుంబ సభ్యులను ప్రశ్నించగా.. తమకేమీ తెలియదని వారు చెబుతున్నారు. సాజిద్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నామని తెలంగాణ డీజీపీ ఆఫీస్‌ స్పష్టం చేసింది.

Next Story