ప్రభుత్వ అధికారులకు తెలంగాణ ACB కీలక సూచన

by Gantepaka Srikanth |

ప్రభుత్వ అధికారులకు తెలంగాణ ఏసీబీ(Telangana ACB) కీలక సూచనలు చేసింది. ఫేక్ ఏసీబీ కాల్స్(Fake ACB calls) పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ప్రభుత్వ అధికారులకు తెలంగాణ ACB కీలక సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ అధికారులకు తెలంగాణ ఏసీబీ(Telangana ACB) కీలక సూచనలు చేసింది. ఫేక్ ఏసీబీ కాల్స్(Fake ACB calls) పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఏసీబీ పేరుతో కొందరు అగంతకులు కొత్త మోసానికి తెరలేపారని సూచించారు. స్వయంగా ఏసీబీ పేరుతోనే ఫేక్ కాల్స్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని.. లేకపోతే మొత్తం ఖాళీ అవ్వడం ఖాయమని పేర్కొన్నారు. ఏసీబీ(Anti Corruption Bureau) పేరుతో ఎవరైనా కాల్ చేసి డబ్బులు అడిగితే వెంటనే తమను సంప్రదించాలని.. ఏసీబీకి ఫిర్యాదు చేయాలని సూచించారు. టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1064ను సంప్రదించండి అని ఏసీబీ హెచ్చరించింది. మోసాన్ని ముందే గ్రహించాలని చెప్పారు. అప్రమత్తంగా ఉండకపోతే పెను ముప్పు తప్పదని హెచ్చరించారు. అధికారులతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరియు ఇలాంటి మోసపూరిత కాల్ చేసేవారితో సంబంధాలు పెట్టుకోవద్దని అధికారులు హెచ్చరించారు. ఫేక్ కాల్స్ వచ్చిన వెంటనే తమకు సమాచారం ఇస్తే.. వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.

Next Story