సె*క్స్‌కు సహకరించలేదని.. మహిళ నోరు, ముక్కు మూసి రక్తస్రావం అయ్యేలా దారుణం

by Naga Rani Yarlagadda |

తనకు సె*క్స్‌కు సహకరించలేదన్న కోపంతో టీనేజర్ ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను దారుణంగా చంపిన ఘటన బెంగళూరులో వెలుగుచూసింది.

సె*క్స్‌కు సహకరించలేదని.. మహిళ నోరు, ముక్కు మూసి రక్తస్రావం అయ్యేలా దారుణం
X

దిశ, వెబ్‌డెస్క్: తనకు సె*క్స్‌కు సహకరించలేదన్న కోపంతో టీనేజర్ ఒక మహిళను దారుణంగా చంపిన ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. యాక్సెంచర్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన షర్మిల డీకే (34).. నగరంలోని రామమూర్తి నగర్లో సుబ్రమణి లే అవుట్లో ఉన్న తన అపార్ట్మెంట్లో మంటలు చెలరేగడంతో ఊపిరాడక మరణించినట్లు కేసు నమోదైంది. జనవరి 3న ఈ ఘటన జరగ్గా.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. తొలుత అగ్నిప్రమాదం వల్ల ఊపిరాడక మరణించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత బీఎన్ఎస్ (BNSS) సెక్షన్ 194(3)(iv) కింద అసహజ మరణం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా సైంటిఫిక్ మెథడ్స్, టెక్నాలజీని ఉపయోగించి ఆధారాలు సేకరించారు. షర్మిల డీకే హత్యకు గురైనట్లు నిర్ధారించారు. నిందితుడిని కర్నాల్ కురైగా గుర్తించారు.

కర్నాల్.. షర్మిల ఇంటి పక్కనే ఉంటున్నాడు. జనవరి 3న రాత్రి 9 గంటలకు షర్మిల ఇంట్లోకి స్లైడింగ్ విండో ద్వారా వెళ్లినట్లు చెప్పాడు. ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించగా తీవ్రంగా ప్రతిఘటించడంతో.. నోరు, ముక్కు మూసి స్పృహ కోల్పోయేలా చేశానని కర్నాల్ విచారణలో వెల్లడించాడు. ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో ఆమెకు రక్తస్రావం కూడా అయినట్లు చెప్పాడు. అనంతరం షర్మిల చనిపోవడంతో సాక్ష్యాలను నాశనం చేసేందుకు ఆమె బట్టలు, నేరానికి కారణమైన వస్తువులను బెడ్రూమ్లో బెడ్ పై ఉంచి వాటికి నిప్పంటించి, ఆమె మొబైల్ ను తీసుకుని పారిపోయినట్లు చెప్పుకొచ్చాడు. నేరాన్ని అంగీకరించిన కర్నాల్ పై.. పోలీసులు బీఎన్ఎస్ 103(1), 64 (2), 66, 238 కింద కేసు నమోదు చేసి, కర్నాల్ ను జైలుకు తరలించారు.

Next Story