హైదరాబాద్ లో దారుణం.. టెకీపై సాఫ్ట్ వేర్ కంపెనీ యజమాని అత్యాచారం

by Ajay Maddhiboyina |   (  Updated:2026-02-22 03:14:42  IST  )

హైద‌రాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. టెకీపై సాఫ్ట్ వేర్ కంపెనీ య‌జ‌మాని అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ ఘటన ఎస్ఆర్‌నగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది.

హైదరాబాద్ లో దారుణం.. టెకీపై సాఫ్ట్ వేర్ కంపెనీ యజమాని అత్యాచారం
X

దిశ‌, వెబ్ డెస్క్: హైద‌రాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. టెకీపై సాఫ్ట్ వేర్ కంపెనీ య‌జ‌మాని అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ ఘటన ఎస్ఆర్‌నగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లాకు చెందిన ఓ మహిళ(28) హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్ పీఎస్ పరిధిలో నివసిస్తోంది. ఎనిమిదేళ్ల క్రితం ఆ మహిళ బాలనగర్‌లో ఓ కంపెనీలో ఉద్యోగం చేయగా, బంజారాహిల్స్‌కు చెందిన మల్లికార్జున రెడ్డి 50 దానిని నిర్వహించారు. అయితే తరవాత కాలంలో అక్కడ ఉద్యోగం మానేసిన మహిళ మరో వ్యక్తిని వివాహం చేసుకోగా 2024లో తిరిగి మల్లికార్జున రెడ్డి ఆమెను సంప్రదించారు.

గతంలో పరిచయం ఉండటంతో అతడు సూచించిన మేరకు మహిళ మధురానగర్‌లోని ఓ ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో మహిళ ఫోటోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయని మల్లికార్జునరెడ్డి బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఫోటోలు, వీడియోలు బయటపెడతానని బెదిరించి మధురానగర్, తిరుపతితో పాటు పలు ప్రాంతాలకు తీసుకునివెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఇటీవల మహిళ గర్భం దాల్చగా ఆ తరవాత కూడా మల్లికార్జున రెడ్డి బెదిరింపులు ఆగలేదు. దీంతో మహిళ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Next Story