- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరకట్న వేధింపులతో టెకీ ఆత్మహత్య
యిడాలో వరకట్న వేధింపులతో భార్యను భర్త హత్య చేసిన ఘటన మరవకముందే దేశంలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. వరకట్న వేధింపులకు బెంగుళూరులో 27ఏళ్ల గర్భిణి ఆత్మహత్య చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: నోయిడాలో వరకట్న వేధింపులతో భార్యను భర్త హత్య చేసిన ఘటన మరవకముందే దేశంలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. వరకట్న వేధింపులకు బెంగుళూరులో 27ఏళ్ల గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. బెంగుళూరులోని సుద్దగుంటిపాల్యలో శిల్ప ప్రవీణ్ దంపతులు నివాసం ఉంటున్నారు. శిల్ప ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, ప్రవీణ్ పెళ్లి తరవాత సాఫ్ట్ వేర్ ఉద్యోగం మానేసి హోటల్ బిజినెస్ ప్రారంభించాడు. వీరికి ఏడాదిన్నర కొడుకు ఉన్నాడు. కాగా తమ కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి వరకట్న వేధింపులే కారణం అని శిల్ప తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
పెళ్లి సమయంలో రూ.15 లక్షల నగదు, 15 తులాల బంగారం ఇచ్చినట్టు తెలిపారు. తరవాత వ్యాపారం కోసం సపోర్ట్ చేయాలని అడిగితే మరో రూ.5 లక్షలు ఇచ్చినట్టు చెప్పారు. ఆ తరవాత కూడా వేధింపులు కొనసాగాయన్నారు. మరోవైపు తమ కూతురు అందంగా లేదని, విడాకులు ఇచ్చి మంచి అమ్మాయితో పెళ్లి చేస్తామని అత్త వేధింపులకు గురిచేసిందని చెబుతున్నారు. వేధింపులు ఆగకపోవడం వల్లనే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై శిల్ప తల్లి దండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పారు.






