- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వికలాంగ విద్యార్థి కళ్లలో కారం కొట్టి ప్లాస్టిక్ పైపుతో ఉపాధ్యాయుడి దాడి.. షాకింగ్ వీడియో లీక్
ఓ వికలాంగ విద్యార్థి కళ్లలో కారం కొట్టి, ప్లాస్టిక్ పైపుతో చిత్రవద చేసిన దారుణమైన వీడియో లీక్ అయ్యింది. ఈ ఘటన ఉత్తర కర్ణాటకలోని బాగల్ కోట్ నగరంలోని నవగర్ ప్రాంతంలో జరిగింది. ప్రత్యేక అవసరాలు గల పిల్లల

దిశ, వెబ్ డెస్క్: ఓ వికలాంగ విద్యార్థి కళ్లలో కారం కొట్టి, ప్లాస్టిక్ పైపుతో చిత్రవద చేసిన దారుణమైన వీడియో లీక్ అయ్యింది. ఈ ఘటన ఉత్తర కర్ణాటకలోని బాగల్ కోట్ నగరంలోని నవగర్ ప్రాంతంలో జరిగింది. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఏర్పాటు చేసిన దివ్యజ్యోతి స్కూల్ ఫర్ ఏబుల్డ్ చిల్ట్రన్ ఆశ్రమ పాఠశాలలో16ఏళ్ల వికాలాంగుడిని ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించాడు. అక్షయ్ ఇందుల్కర్ అనే ఉపాధ్యాయుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు.
విద్యార్థి నేలపై కుప్పకూలి ఏడుస్తున్నా వదిలిపెట్టకుండా, కనికరం లేకుండా చిత్రహింసలు పెట్టాడు. పక్కన ఉన్నవాళ్లు కూడా ఆపకుండా నవ్వుతూ కనిపించడం వీడియోలో కనిపిస్తోంది. ఇక ఈ ఘటనను అదేే పాఠశాలలో పనిచేసిన ఓ వ్యక్తి లీక్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో స్కూల్ లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అక్షయ్ తో పాటు ఆ పాఠశాల నిర్వాహకులు అయిన అతడి భార్యను అరెస్ట్ చేశారు. VIDEO






